
దంచికొట్టిన వాన
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. 10 ప్రాంతాల్లో 2 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లిలో కుండపోత వర్షం పడటంతో ఆ ప్రాంతంలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అలాగే జిల్లా మీదుగా ప్రవహించే ఆకేరు వాగు, మున్నేరు, పాలేరు, రాళ్లవాగు, పందిపంపుల మొదలైన వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. చెరువులు అలుగు పోయడం, వాగులు పొంగడంతో ఏజెన్సీ ప్రాంతాలు కొత్తగూడ, గంగారం, గూడూరుతో పాటు దంతాలపల్లి మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు ఇబ్బందిగా మారింది.
న్యూస్‌రీల్
ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు
కొత్తగూడ: ఏజెన్సీలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గాదె వాగు, ముసలమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నర్సంపేట నుంచి ఉదయం 11గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రజలు దాటకుండా ఎస్సై రాజ్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాళ్లఒర్రె బ్రిడ్జి కోతకు గురై గుంత ఏర్పడడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాగుల ఉధృతిని తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ రాజారాణి పర్యవేక్షించారు.
జిల్లాలోని పది ప్రాంతాల్లో భారీ వర్షం
పెద్దవంగరలో కుండపోత
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

దంచికొట్టిన వాన