
బేస్‌బాల్ సీనియర్ జిల్లా జట్ల ఎంపిక
మహబూబాబాద్ అర్బన్: జిల్లా బేస్‌బాల్ సీనియర్ మహిళా, పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్లూరు ప్రభాకర్ అన్నారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ ఎంపికలో పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సమ్మెట ప్రేమ్‌కుమార్, బేస్‌బాల్ అసోసియేషన్ బాధ్యులు, ఫిజికల్ డైరెక్టర్లు ఆవారి శ్రీనివాస్, తులసి పద్మావతి, సురేష్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.