
కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కేసముద్రం: కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెని న్ వత్సల్ టొప్పో హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎరువుల దుకాణం, పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా,శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను, డంపింగ్ యార్డు, అంతర్గత పనులు పూర్తి చేయాలని సూచించారు. తహసీల్దార్ వివేక్, ఎస్సై మురళీధర్‌రాజు, ఏఓ వెంకన్న, వైద్యసిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో