
పొంగిన పాకాల వాగు..
కేసముద్రంలో..
కేసముద్రం: మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని కుంటలు, చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. అర్పనపల్లి గ్రామంలో వట్టివాగు బ్రిడ్జి మీదుగా వరదనీరు ప్రవహించింది. దీంతో గూడూరు, కేసముద్రం మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వట్టివాగు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
గూడూరు సమీప నెక్కొండ, కేసముద్రం రోడ్డులో పొంగిన పాకాల వాగు
గూడూరు: మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గూడూరు సమీప నెక్కొండ, కేసముద్రం రహదారిలోని పాకాలవాగు మంగళవారం సాయంత్రం పొంగి ప్రవహించింది. దీంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు.
దంతాలపల్లిలో..
దంతాలపల్లి: మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారి అలుగు పోస్తున్నాయి. పాలేరు వాగు బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో పెద్దముప్పారం గ్రామానికి దంతాలపల్లికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

పొంగిన పాకాల వాగు..

పొంగిన పాకాల వాగు..