కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Aug 13 2025 5:20 AM | Updated on Aug 13 2025 5:20 AM

కురవి

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

కురవి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు మంగళవారం తనిఖీ చేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. స్టేషన్‌ పరిసరాలు, వాహనాలు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. సిబ్బంది పని తీరును పరిశీలించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులను తరచూ చెక్‌ చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన వెంట మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ సర్వయ్య, ఎస్సై గండ్రాతి సతీష్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

ఎంపిక

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని పర్వతగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బి.బిందు, బి.గణేష్‌ రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు మందుల శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు నట్టె రవి, పెరుమయ్య, రవికుమార్‌, ఉమారాణి, కృష్ణ, ప్రభాకర్‌, నాగవర్థన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ అవారి శ్రీనివాస్‌ అభినందించారు.

అక్షరాస్యత పెంచాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో నిరక్షరాస్యతను రూపుమాపి అక్షరాస్యతను పెంచాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలో మంగళవారం వయోజన విద్య.. నవభారత్‌ సాక్షరత కార్యక్రమంపై రిసోర్స్‌పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అక్షరాస్యతతో సమాజంలో ఎదురయ్యే మోసాలను తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను తెలుసుకొని ఆర్థికంగా, సామాజిక ఎదుగుదలకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,5768 మంది నిరక్షరాస్యులున్నారని, వారంతా ఉల్లాస్‌ యాప్‌లో నమోదై.. ప్రతీ ఒక్కరు అక్షరాస్యత సాధించాలన్నారు. శిక్షణ పొందిన రిసోర్స్‌పర్సన్లు జిల్లా 100శాతం అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోర్సు డైరెక్టర్‌ బి.అప్పారావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డీడీ ఎడ్యుకేషన్‌ అధికారి ధన్‌రాజ్‌, ఆర్పీలు ప్రవీణ్‌ కుమార్‌, యాదగిరి, మహేష్‌, పాఠశాల హెచ్‌ఎం సిరినా యక్‌ తదితరులు పాల్గొన్నారు.

కేయూ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్‌లో 31 శాతం, రెండో సెమిస్టర్‌లో 30 శాతం, మూడో సెమిస్టర్‌లో 35 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, జి.పద్మ, ఆసిం ఇక్బాల్‌, చిర్ర రాజు, వి.మహేందర్‌, పి.వెంకటయ్య అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ బి.నేతాజీ, క్యాంపు ఆఫీసర్‌ ఎస్‌.సమ్మయ్య పాల్గొన్నారు.

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ
1
1/2

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ
2
2/2

కురవి పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement