ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు.. | - | Sakshi
Sakshi News home page

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు..

Jun 5 2025 8:18 AM | Updated on Jun 5 2025 8:18 AM

ఈ–సైన

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు..

కాజీపేట అర్బన్‌: మారుతున్న కాలానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం అవుతూ భూక్రయవిక్రయదారులకు సత్వర సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌, వాట్సప్‌ చాట్‌బాట్‌ ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తుండగా ఇప్పుడు ఈ–సైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది.

సాంకేతికతతో సేవలు..

రోజంతా రిజిస్ట్రేషన్‌ నిమిత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వేచి ఉండకుండా కోరుకున్న తేదీ, కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ ఏప్రిల్‌ 10వ తేదీన స్లాట్‌ బుకింగ్‌ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా జూన్‌ 2వ తేదీన పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన స్లాట్‌ బుకింగ్‌ విధానం రాష్ట్రంలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రారంభించారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ పద్ధతి పని చేస్తుంది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే తరుణంలో ఏర్పడే సందేహాలకు సమాధానం వాట్సప్‌ ద్వారా అందించేందుకు వాట్సప్‌ చాట్‌బాట్‌ పేరిట జూన్‌ 2వ తేదీన 82476 23578 నంబర్‌ను ఏఐ టెక్నాలజీతో భూభారతి స్లాట్‌ బుకింగ్‌ పేరిట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి పూర్తి పారదర్శకతతో కూడిన ఈ ఆధార్‌ అనుసంధానంతో కూడిన ఈ–సైన్‌ విధానానికి శ్రీకారం చుట్టారు.

ఈ –సైన్‌ విధానంతో ఇలా...

భూక్రయవిక్రయదారులు తమ భూమి దస్తావేజులను తయారు చేసుకుని రిజిస్ట్రేషన్‌ నిమిత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వస్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా తామ తయారు చేసుకున్న దస్తావేజులపైన భూక్రయవిక్రయదారులు, సబ్‌ రిజిస్ట్రార్‌ వేలిముద్రతోపాటు సంతకాలు చేస్తుంటారు. ఈ–సైన్‌ విధానంలో భూక్రయవిక్రయదారులు తయారు చేసుకున్న దస్తావేజుల్లో వేలిముద్రతోపాటు సంతకాలు చేస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమిత్తం ఫొటోలు దిగడం, బయోమెట్రిక్‌ విధానంలో ఆధార్‌ కార్డును అనుసంధానం చేసేందుకు వేలిముద్రను వేస్తారు. వేలిముద్ర ఆధారంగా భూక్రయవిక్రయదారులతోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రింట్‌ తీసిన డాక్యూమెంట్‌పై సంతకం చేయరు. ఈ–సైన్‌ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ ఆధార్‌ను అనుసంధానం చేసుకుని సంతకాన్ని పసిగట్టి గ్రీన్‌ కలర్‌లో రైట్‌ టిక్‌ మార్క్‌ను చూపిస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లుగా సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ధారిస్తారు. కాగా ఈ–సైన్‌ విధానంతో పూర్తి పారదర్శకతోపాటు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌..

ఏఐతో చాట్‌బాట్‌

పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికై న

వరంగల్‌ రూరల్‌

‘వరంగల్‌ రూరల్‌’లో ఈ–సైన్‌ విధానం..

ఈ–సైన్‌ విధానంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలో కూసుమంచి, ఆర్మూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈనెల మొదటివారంలో ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ రూరల్‌ కార్యాలయాన్ని సైతం ఈ–సైన్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను త్వరలో వరంగల్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఈ నెల రెండో వారంలో ఈ–సైన్‌ విధానంతో రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలో నూతన విధానంతో రిజిస్ట్రేషన్లు

ఈ–సైన్‌ విధానంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆర్మూర్‌, కుసుమంచిలిలో టెస్ట్‌ డ్రైవ్‌గా ప్రారంభించారు. జూన్‌ రెండో వారంలో వరంగల్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ విధానంలో రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తాం.

– ఫణీందర్‌, జిల్లా రిజిస్ట్రార్‌

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు.. 1
1/2

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు..

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు.. 2
2/2

ఈ–సైన్‌తో రిజిస్ట్రేషన్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement