సర్వం సిద్ధం చేశాం
తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇందుకు అనుగునంగా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశాం. ముందుగా పచ్చిరొట్ట వేయాలని రైతులను ప్రోత్సహించి 50శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. నకిలీ విత్తనాల బెడద లేకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాం. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతాం. కొరత ఉందని ప్రచారం చేస్తే రైతులు నమ్మకండి.
– విజయ నిర్మల, డీఏఓ


