ధాన్యం రైతులు అధైర్యపడొద్దు
మరిపెడ రూరల్: ధాన్యం రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ అన్నారు. మరిపెడ మండలం తండధర్మారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని ధాన్యం సేకరణ రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి, ఏపీఎం రాములు, సిబ్బంది, రైతులు తదితరులు న్నారు.
కొనుగోళ్లు పూర్తి చేయాలి..
పెద్దవంగర: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని పోచంపల్లి, గంట్లకుంట, చిట్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. పలు రికార్డులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అనవసరమైన వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. ధాన్యం కాంటా పెట్టి వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచి ంచారు. డీసీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేందర్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి..
తొర్రూరు రూరల్: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ సూచించారు. బుధవారం మండలంలోని మాటేడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఆయాశాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సహకారశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతరశాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్


