లక్షణాలు గుర్తిస్తే కాపాడొచ్చు..
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకో వాలని అనుకునే వారి మానసిక పరిస్థితి గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా మానసిక వ్యాధిగ్రస్తులు, సున్నిత మనస్తత్వం గలవారు, మత్తు పదార్థాలకు బానిసైన వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరిలో మూడు స్టేజీలుగా గుర్తిస్తాం. తాను ఆత్మహత్య చేసుకుంటాను అని ఇతరులతో చెప్పడం, కత్తితో కోసుకోవడం.. ఇతర ప్రయత్నాలు చేయడం, మూడో దశలో ఆత్మహత్య చేసుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇస్తే మార్పు వస్తుంది. మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. లక్షణాలు గుర్తించి సరైన వైద్యం అందిస్తే మనిషి ప్రాణం కాపాడవచ్చు.
– ఎం. మహేశ్‌కుమార్, హెచ్‌ఓడీ, సైకియాట్రిస్ట్
డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
జిల్లాలో ఆత్యహత్యలకు పాల్పడుతున్న వారు ఎక్కువగా ఉండడం బాధాకరం. క్షణికావేశంలో అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండేందుకు కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్రిమిసంహారక మందులు భద్రపరిచే విషయంపై వ్యవసాయశాఖ సహకారంతో రైతులతో సమీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ
●
లక్షణాలు గుర్తిస్తే కాపాడొచ్చు..


