ప్రజల స్నేహితులుగా పోలీసులు●
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: పోలీసులంటే ప్రజల స్నేహితులుగా ఉండేవిధంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ అనేది ప్రజలకు సేవ చేయడానికి ఉండే సంస్థ అని, ప్రతీ పౌరుడు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులు నేరుగా పోలీసు అధికారులకు తెలియజేసే హక్కు కలిగి ఉన్నారన్నారు. ఇందులో ఎటువంటి మధ్యవర్తులు, సిఫార్సుదారులు, ఇతర ప్రభావాలు అవసరంలేదన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వయంగా చెప్పగలిగితే త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే మన పరిసరాలు మన బాధ్యతలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాలిన ఆకులు, చెత్తచెదారం, పనికిరాని పేపర్లు, పరిసరాలను శుభ్రపరిచారు.


