విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
నేటి నుంచి ప్రతినిధుల సభలు
విద్యార్థుల భారీ ర్యాలీ
కేయూ క్యాంపస్ : విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) జాతీయ కార్యదర్శి, ప్రగతి శీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి. ప్రసాద్ అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడీఎస్‌యూ ఐదు దశాబ్దాలుగా దేశంలో సమాన విద్య విధానం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేర విద్యాకాషాయీకరణకు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందని విమర్శించారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభ దశలో ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల పేర హతమారుస్తున్నారని ఆరోపించారు. డాలర్ సంపాదనకు భారతదేశం నుంచి అమెరికా సామ్రాజ్యావాదదేశానికి కొంతమంది విద్యార్థులు, మేధావులు వలసపోతున్నారన్నారు.అలాకాకుండా ఈదేశ అభివృద్ధిని కాంక్షించే పౌరులుగా ఇక్కడే పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్‌రావు, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి. సంధ్య మాట్లాడుతూ అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ పీడీఎస్‌యూ విద్యార్థుల హక్కులకోసం పనిచేస్తుందన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, నాయకులు సౌరాన్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ధీరధ్, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్, ఎం. వినోద్ మాట్లాడారు. ఈసభలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, రాజేశ్వర్, డి. శ్రీకాంత్, మంద నవీన్, సంతోష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్. గౌతమ్, కుమార్ పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు.
ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి
పి. ప్రసాద్
ఆర్ట్స్ అండ్ ౖ సెన్స్ కళాశాలలో
పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
పీడీఎస్‌యూ రాష్ట్ర మహసభలను పురస్కరించుకుని విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని ఏకశిల పార్కు నుంచి యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు.
విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి


