ఎన్నికల నిబంధనలపై అవగాహన అవసరం
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: ఎన్నికల సంఘం నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్‌ఓలతో మ్యాపింగ్ పక్కా జరిపించాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, డీపీఓ హరిప్రసాద్, కమిషనర్ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, వివిధ పార్టీల నాయకులు మార్నెని వెంకన్న, సురేష్ నాయుడు, అజయ్‌సారథిరెడ్డి, సూర్నపు సోమయ్య, శ్యాంసుందర్‌శర్మ, బొమ్మ వెంకటేశ్వర్లు, ఫరీద్, రాజమౌళి పాల్గొన్నారు.
టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి
పదో తరగతి పరీక్షల్లో మెరుౖగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికా రులతో పదో తరగతి పరీక్షలపై నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ పరీక్షలకు సుమారు 60 రోజుల సమయం మాత్రమే ఉందని ఆ సమయానికి తగ్గట్టుగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతీరోజు విద్యార్థులతో అ న్ని సబ్జెక్ట్‌లను చదివించి సాధన చేయించాలని తెలి పారు. విద్యార్థుల చేతి రాతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల వ్యక్తిగత మానసిక స్థితిగతులను నిత్యం పరిశీలించాలన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి మెలకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, ఏసీజీ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు పాల్గొన్నారు.


