ఫిర్యాదులకు లోకల్‌ కోర్టు మంచివేదిక | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులకు లోకల్‌ కోర్టు మంచివేదిక

Jan 8 2026 8:55 AM | Updated on Jan 8 2026 8:55 AM

ఫిర్య

ఫిర్యాదులకు లోకల్‌ కోర్టు మంచివేదిక

పెద్దవంగర: విద్యుత్‌ వినియోగదారులు నేరుగా తమ ఫిర్యాదులు తెలియజేసేందుకు లోకల్‌ కోర్టు మంచి వేదిక అని టీజీ ఎన్సీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్‌పర్సన్‌ ఎన్‌వీ వేణుగోపాల చారి అన్నారు. మండలంలోని చిన్నవంగర విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం విద్యుత్‌ వినియోగదారుల కోసం లోకల్‌ కోర్టును నిర్వహించారు. పలు సమస్యలపై రైతుల నుంచి 12 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వేణుగోపాల చారి మాట్లాడారు. విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు లోకల్‌ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఇది మంచి వేదికని, అందిన ప్రతీ దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని విద్యుత్‌ అధికారులను అదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్‌ మెంబర్‌ రమేష్‌, ఫైనాన్స్‌ మెంబర్‌ దేవేందర్‌, ఇండిపెండెంట్‌ మెంబర్‌ రామారావు, డీఈ రవి, ఏడీఈ చలపతిరావు, ఏఈ మహేష్‌, పెద్దవంగర ఏఈ రమేష్‌ బాబు, సబ్‌ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ నెల 20న జరగనున్న తల్లిదండ్రుల సమావేశం విజయవంతం చేయాలని డీఐఈఓ మదార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం తల్లిదండ్రులు–అధ్యాపకుల ఆహ్వాన పోస్టర్‌ను డీఐఈఓ మదార్‌, ప్రిన్సిపాళ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్‌ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లల భవిష్యత్‌, ఒత్తిడి తగ్గించడానికి సలహాలు, సూచనలు తె లుసుకోవడానికి మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి తల్లిద ండ్రులు తప్పక హాజరకు కావాలని కోరా రు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల జిల్లా అధ్యక్షుడు పొక్కుల సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్‌, ప్రిన్సిపాల్‌ డీపీ గణేష్‌, అధ్యాపకులు నాగిరెడ్డి, షాహిద్‌, శివకుమార్‌, ప్రేమ్‌శేఖర్‌, సారయ్య, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

డోర్నకల్‌ ఎఫ్‌ఆర్‌ఓ రేణుక సస్పెన్షన్‌

డోర్నకల్‌: అటవీశాఖ డోర్నకల్‌ రేంజ్‌ అధికారి పి.రేణుక సస్పెండ్‌ అయ్యారు. కొద్ది నెలల క్రితం రేంజ్‌ పరిధిలో సండ్ర కర్ర అక్రమ తరలింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్‌ఆర్వో రేణుకను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ డాక్టర్‌ సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో డోర్నకల్‌, కురవి మండలాల నుంచి సండ్ర కర్రను సేకరించి తరలిస్తుండగా ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు విచారణ జరిపి గత అక్టోబర్‌లో డోర్నకల్‌, కురవి సెక్షన్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఆర్‌ఓ రేణుకను కూడా బాధ్యురాలిని చేస్తూ ఆమెను కూడా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

పర్మిట్‌ ట్యాంపరింగ్‌పై విచారణ..

జిల్లాలో కర్ర తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు ట్యాంపరింగ్‌ జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ జరి పినట్లు సమాచారం. మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో కర్ర కొనుగోలు చేసి మహబూబా బాద్‌లో కొన్నట్లు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన అధికారులు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకుడిని విచారించినట్లు సమాచారం.

హాస్టల్‌లో ప్రవేశాలు

రద్దు చేసుకోవాలి

కేయూ క్యాంపస్‌: కేయూలో రెండో పీజీ చేస్తున్న విద్యార్థులు హాస్టల్‌లో ప్రవేశాలను రద్దు చేసుకోవాలని కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ ఆచార్య ఎల్‌పీ రాజ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరా రు. డబుల్‌ పీజీ చదివే విద్యార్థులకు వర్సిటీ నిబంధనల ప్రకారం హాస్టల్‌ వసతి, మెస్‌ సదుపాయం ఇవ్వకూడదని గతంలోనే స్పష్టమై న ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘంచి హాస్టళ్లలో ప్రవేశాలు పొందిన ట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తమ హాస్టళ్లలో ప్రవేశాన్ని ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రద్దు చేసుకోకపోతే తామే రద్దు చేస్తామని తెలిపారు. హాస్టల్‌ డిపాజిట్‌ కూ డా తిరిగి ఇవ్వమని, కళాశాల ప్రవేశం సైతం ర ద్దుకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

ఫిర్యాదులకు లోకల్‌ కోర్టు మంచివేదిక 
1
1/1

ఫిర్యాదులకు లోకల్‌ కోర్టు మంచివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement