విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలి
గూడూరు: విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని డీఐఈఓ మధర్‌గౌడ్, సర్పంచ్ రేగ సు జాత అన్నారు. మట్టెవాడలో గూడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల కార్యక్రమంలో విద్యార్థులు గ్రామీణ ప్రాంత జీవన విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరుశురాములు, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సారంగపాణి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిట్టిబాబు, శ్రీధర్‌సింగ్, రమేష్, సతీష్, రవికుమార్, సుధీర్ పాల్గొన్నారు.


