ఊరేగింపుగా వచ్చి.. సంధల్ సమర్పించి..
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో సోమవారం రాత్రి అన్నారం దర్గా యాకూబ్‌షావలి ఉర్సు ప్రారంభమమైంది. బోలేషావలి ఇంటి వద్ద మత పెద్దల ఆధ్వర్యంలో గంధం, సెంటు, రోజ్‌వాటర్, గులాబీ పూలను కలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధం (సంధల్) తీసుకుని మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. అనంతరం గంధం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో యాకూబ్‌బాబాకు మత పెద్దలు, ముజావర్లు సలాం పాట నిర్వహించారు. ఉత్సవాల నేపథ్యంలో అన్నారం దర్గా పరిసర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. కాగా, అంతకుముందు మధ్యాహ్నం ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్.. మామునూరు ఏసీపీ వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా యాకూబ్‌షావలిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. గంధం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్, సూపరింటెండెంట్ ఎండి.ఫయాజ్, ఇన్‌స్పెక్టర్ రియాజ్, ముజావర్లు గౌస్‌పాషా, యాకూబ్‌పాషా, ఖాజాపాషా, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, గొడుగు భిక్షపతి, మోటపోతుల సారంగపాణి, గొడుగు వినయ్, గొడుగు రమేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఉర్సులో విడిది చేస్తున్న భక్తులు, ఉత్సవాల్లో భాగంగా ఖవ్వాలీలో పాల్గొన్న భక్తులు
ప్రారంభమైన అన్నారం దర్గా ఉర్సు
భక్తిశ్రద్ధలతో బాబాకు మొక్కులు..
ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు
దర్గా పరిసరాల్లో భక్తుల కోలాహలం
ఊరేగింపుగా వచ్చి.. సంధల్ సమర్పించి..
ఊరేగింపుగా వచ్చి.. సంధల్ సమర్పించి..


