దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు రూరల్: వరి, మక్కలు, మిర్చి తదితర పంట ఉత్పత్తుల విక్రయాల్లో రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంటాయన్నారు. తేమశాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు, డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి, పాపిరెడ్డి, టీకునాయక్, వెంకన్న, కాంగ్రెస్ నాయకులు సుంచు సంతోష్, సోమరాజశేఖర్, మాలోతు సునీత, కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, పెదగాని సోమయ్య, బాపురెడ్డి, మల్లేశంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, జలకం శ్రీను, సధాకర్, సురేందర్‌రెడ్డి, సోమన్న, శ్రావణ్‌కుమార్, యాకూబ్‌రెడ్డి, గౌతంరెడ్డి పాల్గొన్నారు.


