రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తపల్లి రవి
నెహ్రూసెంటర్: తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తపల్లి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నారాయణపేట జిల్లాలో జరిగిన సంఘం రాష్ట్ర మహాసభల్లో ఎన్నికై నట్లు రవి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికకు కృషి చేసిన సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తపల్లి రవి


