మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి..

Mar 28 2025 1:19 AM | Updated on Mar 28 2025 1:17 AM

సంగెం: మొక్కజొన్న చేను చూసి రావడానికి వెళ్తున్న ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఓ కంటైనర్‌ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గవిచర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కళావతి, గాలి కుమారస్వామిని 20 ఏళ్లక్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కుమారుడు చందు(18) ఉన్నా డు. 10 ఏళ్ల క్రితం కుమారస్వామి మృతి చెందగా కళావతి అదే గ్రామానికి చెందిన దుడ్డు రవిని రెండో వివాహం చేసుకుంది. అతను కూడా మృతి చెందాడు. అప్పటి నుంచి కళా వతి.. కుమారుడు చందుతో కలిసి జీవిస్తోంది. చందు ఇంట ర్మీడియట్‌ చదువుతూనే తల్లికి వ్యవసాయంలో చేదోడువా దోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బైక్‌పై మొక్కజొన్న చేను వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ కంటైనర్‌ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో చందుకు తీవ్ర గాయాలుకావడంతో వెంటనే ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి కళావతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ పేర్కొన్నారు. కాగా, చేతికి అందొస్తున్నావు.. ఇక నా కష్టాలు త్వరలోనే తీరుతాయని అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోయావా బిడ్డా అంటూ చందు మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించించింది. ఇక తాను ఎవరికోసం బతకాలంటూ బోరున విలపించింది.

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ..

యువకుడి దుర్మరణం

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఇసుక లారీ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా ఇరు డ్రైవ ర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఛాగల్లు శివారులో జా తీయ రహదారిపై జరిగింది. సీఐ వేణు కథనం ప్రకారం.. మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన హరీశ్‌(28) రోజూ రాఘవాపూర్‌ నుంచి ఛాగల్లు వరకు వాటర్‌ ట్యాంకర్‌తో జాతీయ రహదారిపై డివైడర్‌పై ఉన్న మొక్కలను నీరు పోస్తుంటాడు. గురువారం కూడా పోస్తున్నాడు. ఈ క్రమంలో జనగామ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న లారీ.. ట్యాంకర్‌ వెను క నుంచి నీరు పడుతున్న హరీశ్‌తోపాటు ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హరీశ్‌ లారీ, ట్యాంకర్‌ మధ్య ఇరుక్కుని దుర్మరణం చెందాడు. ట్యాంకర్‌ డ్రైవర్‌ బెజ్జం రమేశ్‌, లారీ డ్రైవర్‌ సిద్ధగోని స్వామికి గాయాలయ్యాయి. విషయం తె లుసుకున్న డీసీపీ రాజమహేంద్రనాయక్‌, సీఐ వేణు, ఎస్సై వినయ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని హరీశ్‌ మృతదేహాన్ని స్థానికుల సహకారంతో బయటకు తీశారు. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, మూడు నెలల వయసున్న కుమార్తె ఉంది.

ఏకశిల స్కూల్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ..

ఐనవోలు: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని పున్నేలు క్రాస్‌ ఏకశిల స్కూల్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తిని పెద్ద వాహనం ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మృతుడు సిమెంట్‌ రంగు ప్యాంట్‌, లేత నీలిరంగు, మెరూన్‌ కలర్‌ ఫుల్‌ హ్యాండ్‌ షర్టు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712685244, 8712685030 నంబర్లలో(ఐనవోలు పోలీస్‌ స్టేషన్‌) సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు.

బైక్‌ను ఢీకొన్న కంటైనర్‌

యువకుడి మృతి..గవిచర్లలో ఘటన

మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి.. 1
1/2

మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి..

మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి.. 2
2/2

మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement