గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ ఉదయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా కోతులు, పందులు, కుక్కల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తాను స్వయంగా వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
సమస్య: న్యూ నెహ్రూ స్ట్రీట్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య సమస్యలతో పాటు వీధిలోని ఖాళీ స్థలాల్లో చెట్లౖ పె వందలాది కోతులు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం.
(మహ్మద్ జరీనాబేగం, జయలక్ష్మి, నజీర్, మహేష్‌కుమార్, కృష్ణవేణి, వై.శ్రీనివాసరావు, ఎండీ సమీర్‌పాషా, నిఖిల్, నజీమా, బాలాజీ, శ్రీనాథ్, గాజుల వేణుగోపాల్)
కమిషనర్: న్యూ నెహ్రూ స్ట్రీట్‌లోని తాగునీటి సమస్యను సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌లో చేరుస్తున్నాం. రంజాన్ పండుగ వరకు వీధికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తాం. పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. కోతులు ఉండే చెట్లను తొలగిస్తాం.
సమస్య: సాయినగర్ నాలుగో వీధిలో డ్రెయినేజీ, రోడ్డు లేక దుర్గంధం, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
(బొమ్మెన అశోక్‌కుమార్, శబరీష్, పుట్టా శ్రీనివాస్)
కమిషనర్: నిధులు సమకూరిన తర్వాత డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం.
సమస్య: సోమ్లాతండాలో పైపులైన్ లీకేజీలు, మురుగు కాల్వల్లో నల్లాలతో తాగునీరు కలుషితమవుతోంది. కుక్కల బెడద తీవ్రంగా ఉంది. (చరణ్, శేఖర్, సేవియా)
కమిషనర్: సిబ్బందిని వెంటనే పంపించి మరమ్మతు పనులు చేపడుతాం. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటాం.
సమస్య: కుక్కలు, కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది.
(నలబోలు శ్రీనివాస్, ఉషాబాయి ఎస్సీ బీసీ కాలనీ, దీపిక యాదవనగర్, సాగర్ శాంతినగర్, సత్యనారాయణ లడ్డా మెయిన్ రోడ్డు, సాయి, సంతోష్, మధు
బంకట్‌సింగ్‌తండా, నాగమణి సుభాష్‌స్ట్రీట్)
కమిషనర్: కుక్కల బెడద నివారణకు మహబూబాబాద్ మున్సిపాలిటీతో అవగాహన ఒప్పందం చేసుకుని ఏబీసీ సెంటర్‌లో కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయిస్తాం. పందుల సంచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
సమస్య: అంబేడ్కర్‌నగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలి.
(దేవర వెంకటేశ్వర్లు)
కమిషనర్: అంబేడ్కర్‌నగర్‌లో ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
సమస్య: పిచ్చి మొక్కలు, చెత్త తొలగించాలి.
(దాసరి నానీయాదవ్ యాదవనగర్, షేక్ యునూస్‌పాషా అంబేడ్కర్‌నగర్, మల్లికార్జును బ్యాంక్‌స్ట్రీట్)
కమిషనర్: పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం.
సమస్య: విద్యుత్ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేయాలి.
(అనురాధ చర్చి కాంపౌండ్, కుందోజు వీరబ్రహ్మచారి కుందోజువారి వీధి)
కమిషనర్: లైట్ల ఏర్పాటుకు సిబ్బందిని ఆదేశించాం.
సమస్య: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి.
(ద్వారకాలడ్డా–మెయిన్‌రోడ్)
కమిషనర్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
సమస్య: సర్దార్ క్వార్టర్స్ రోడ్డు మరమ్మతులు చేయాలి.
(గుండాల శ్రీకాంత్)
కమిషనర్: సమస్యను పరిశీలిస్తాం.
ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మున్సిపల్
కమిషనర్ ఉదయ్‌కుమార్
మహబూబాబాద్/తొర్రూరు: సాక్షి ఆధ్వర్యంలో రేపు(శుక్రవారం)మానుకోట మున్సిప ల్ కమిషనర్ నోముల రవీందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్‌లతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలి.
రేపు కమిషనర్లతో ఫోన్ ఇన్
రేపు కమిషనర్లతో ఫోన్ ఇన్
రేపు కమిషనర్లతో ఫోన్ ఇన్


