చిట్యాల: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లా మాడ్ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు దంపతులు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్‌రావు, అతడి భార్య దాశశ్వర్ సుమన అలియాస్ రజిత మృతదేహాలు శుక్రవారం స్వగ్రామం చల్లగరిగెకు చేరుకోనున్నాయి. ఇదే రోజు కుటుంబీకులు.. సుధాకర్, రజిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుధాకర్ దంపతుల మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబీకులతోపాటు గ్రామస్తులు బుధవారం ఛత్తీస్‌గఢ్ బయలుదేరగా గురువారం చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించారు. శుక్రవారం ఉదయం చల్లగరిగెకు తీసుకురానున్నారు. కాగా, సుధాకర్ దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
శుక్రవారం స్వగ్రామానికి చేరుకోనున్న
సుధాకర్, రజిత మృతదేహాలు
చల్లగరిగెలో విషాదఛాయలు