ఇంటి వద్దే ఓటు హక్కు.. | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దే ఓటు హక్కు..

Published Fri, Nov 17 2023 1:20 AM

- - Sakshi

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు..

దివ్యాంగులు, వృద్ధుల కోసం పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్‌చైర్లు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25లోపు తహసీల్దార్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో తహసీల్దార్‌, మున్సిపాలిటీ కార్యాలయాలకు వీల్‌చైర్లు సరఫరా చేస్తారు. వీల్‌చైర్స్‌కు సహాయకులను ఏర్పాట్లు చేస్తారు. కాగా కేంద్రాల్లో వీల్‌చైర్ల ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్‌: జిల్లాలోని మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక విడుదల చేశారు. దీనిలో దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాలను కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈసారి ఎన్నికల కమిషన్‌ దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. దీనికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12డీ ఫాంల స్వీకరణ పూర్తి చేసి వారి జాబితాను సిద్ధం చేశారు.

దివ్యాంగులు 12,691..

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 12,691 మంది దివ్యాంగులు ఉన్నారు. కాగా వీరిలో ఇంటివద్దే ఓటు హక్కు వినియోగించుకునేందుకు 477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఎన్నికల అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వారు 6,601 మంది ఉండగా.. 665 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు కూడా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

వారి ఇంటికే..

దివ్యాంగులు, వయోవృద్ధుల ఇంటికి పోలీస్‌, బీఎల్‌ఓ, ప్రిసైడింగ్‌ అధికారి, బూత్‌ ఏజెంట్‌, పార్టీ నాయకులు ఈవీఎంలతో వెళ్లి ఓటు వేయిస్తారు. ఓటు ఏ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉంటే అక్కడే జమ చేస్తారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటారు.

దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వారికి అవకాశం

12డీ ఫాం ద్వారా దరఖాస్తులు

దివ్యాంగులు 477మంది,

వయోవృద్ధులు 665 మంది

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement