Telangana News: వామ్మో.. పాకాల వాగులో మొసలి.. భయాందోళనలో రైతులు..
Sakshi News home page

వామ్మో.. పాకాల వాగులో మొసలి.. భయాందోళనలో రైతులు..

Published Mon, Aug 14 2023 1:30 AM

- - Sakshi

వరంగల్‌: మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు నీటిలో ఆదివారం రైతులకు మొసలి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని వారు తమకు తెలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌కు సమాచారం అందించడంతో అతను వీడియోలో బంధించాడు. గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పాకాల వాగు బ్రిడ్జికి సమీపంలో పెద్దమర్రి ఉంది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు సాగవుతున్నాయి.

నిత్యం రైతులు దుక్కులు దున్నిన తరువాత పశువులను వాగు నీటితో శుభ్రం చేస్తారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగిన విషయం తెలిసిందే. ఆ నీటిలో కొట్టుకు వచ్చిన మొసలి గూడూరు సమీపంలోని నీటి గుంతలలో సంచరిస్తోంది. రెండు మూడు రోజులుగా పెద్దమర్రి ప్రాంతంలో నీరు తాగడానికి వెళ్లిన గేదెలు, పశువులను చంపడానికి యత్నించగా అవి బెదిరి బయటికి వచ్చాయి. ఈ ఘటనను చూసిన ఓ రైతు మొసలిగా గుర్తించాడు. ఎవరూ నీటిలో దిగొద్దని సహచర రైతులకు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement