ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశా ల ఈఎన్‌టీ విభాగంలో నాలుగో కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను పీఎంఎస్‌ఎస్‌వై ఆస్పత్రిలో బుధవారం విజయవంతంగా పూర్తిచేసినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్ తెలి పారు. జనగామ జిల్లా రాజవరం గ్రామానికి చెందిన బైరగోని నరేశ్, గౌతమి దంపతుల కుమారుడు రుద్రాంత్(నాలుగేళ్ల వయసు)కు ఎంజీఎం సూపరిండెంట్ హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో డాక్టర్లు ఆనంద్ ఆచార్య, మనీష్‌కుమార్, సంపత్‌రావు, అనస్థీషీయా ప్రొఫెసర్లు మురళీ, హనుమంతరావు, ఆడియాలజిస్టులు వీణ, రతన్‌సింగ్ ముఖ్యపాత్ర పోషించారు.


