ఆలిండియా జూడో టోర్నమెంట్‌కు కేయూ జట్లు | - | Sakshi
Sakshi News home page

ఆలిండియా జూడో టోర్నమెంట్‌కు కేయూ జట్లు

Mar 19 2026 8:27 AM | Updated on Mar 19 2026 8:27 AM

ఆలిండియా జూడో టోర్నమెంట్‌కు కేయూ జట్లు

కేయూ క్యాంపస్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ జూడో టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ జూడో పురుషుల, మహిళల జట్లు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ వెంకయ్య బుధవారం తెలిపారు. చంఢీఘర్‌ యూనివర్సిటీలో ఈనెల 22 వరకు నిర్వహించనున్న జూడో పోటీల్లో పాల్గొనే జట్టులో ఎం.సాయికిరణ్‌నాయక్‌ (యూసీపీఈ, వరంగల్‌) ఎం.దర్శి త్‌నాయక్‌ (ఎల్‌బీ కాలేజీ, వరంగల్‌), కె.అనూష, డి.నక్షత్ర (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్డీసీ, వరంగల్‌ వెస్ట్‌), డి.బేబీ లాహా (టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ, వరంగల్‌ వెస్ట్‌) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈజట్లకు టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ కొత్తగూడెం ఫిజికల్‌ డైరెక్టర్‌ డి.శ్వేత మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

20 నుంచి కేవీలో అడ్మిషన్‌కు దరఖాస్తులు

కాజీపేట అర్బన్‌ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశానికి ఈనెల 20వ తేదీనుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు అడ్మిషన్లకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 1వ తరగతిలో ప్రవేశానికి 6 నుంచి 8 ఏళ్ల వయసులోపు విద్యార్థులు అర్హులుగా పేర్కొంది. ఆన్‌లైన్‌లో kvadmissions అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక తొలి జాబితాను ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement