ఉద్రిక్తతల నడుమ నామినేషన్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతల నడుమ నామినేషన్ల పరిశీలన

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

● కార్యాలయంలోకి జొరబడి నామినేషన్‌ పత్రాలు చింపివేత

● కార్యాలయంలోకి జొరబడి నామినేషన్‌ పత్రాలు చింపివేత

పత్తికొండ: పత్తికొండలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల చించివేతకు యత్నించడంతో గందరగోళ పరిస్థితులకు తావిచ్చింది. మంగళవారం పత్తికొండ పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేజర్‌ గ్రామ పంచాయతీ అభ్యర్థుల నామినేషన్‌ల పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీ నాయకులు వందలో సంఖ్యలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తిష్ట వేసి వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను రిజెక్టు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో పట్టణంలో 7వ వార్డు మెంబరు నామినేషన్‌ రిజెక్టుకు ఏకంగా ఘర్షణకు దిగారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే సాయంత్రం సమయంలో వందల సంఖ్యలో మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు గుంపుగా కార్యాలయంలోకి జోరబడ్డారు. సర్పంచ్‌ నామినేషన్‌ పత్రాలను ఇవ్వాలని రిటర్నింగ్‌ అధికారిని బెదిరింపులకు గురి చేశారు. ఆయన నసేమిరా అనడంతో చేతికి దొరికిన పేపర్లు చింపి నానా హంగామా చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగించినా పోలీసులు వారిని అదు పు చేయలేకపోయారు. డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌ అక్కడికి చేరుకొని పోలీసుల సాయంతో అందరినీ కార్యాలయం నుంచి బయటకు పంపారు. స్క్రూటినీలో అందరి నామినేషన్‌ పత్రాలు ఆమోదం పొందాయని ఆర్వో అన్వర్‌, ఆర్డీఓ చిన్న ఓబులేష్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement