కార్తీక పౌర్ణమిన ఆకాశంలో పుణ్యమి చంద్రుడు ప్రకాశిస్తుండగా.. అవనిపై దివ్వెల వెలుగులు విరజిమ్ముతుండగా శ్రీగిరిలో భక్తిభావం ప్రజ్వరిల్లింది. ఇల కై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి దశవిధహారతులు, గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం దేదీప్యమానంగా సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చిన వేలాది మంది భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలచరించి కార్తీకదీపాలను వెలిగించి, ప్రత్యేక నోములు నోచుకున్నారు. జ్వాలాతోరణోత్సవంలో భక్తిశ్రద్ధలతోపాల్గొన్నారు.
– శ్రీశైలంటెంపుల్


