గెలిచే సత్తా లేకనే టీడీపీ నామినేషన్‌ ఉపసంహరణ | - | Sakshi
Sakshi News home page

గెలిచే సత్తా లేకనే టీడీపీ నామినేషన్‌ ఉపసంహరణ

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే పుసులూరు గ్రామ పంచాయతీ టీడీపీ మద్దతు అభ్యర్థి నామినేషను ఉపసంహరించుకున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. కల్లూరు మండలం పుసులూరు గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి స్వామిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్పంచ్‌ అభ్యర్థిగా స్వామిదేవి ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఇంటి వద్దకు అబద్దపు మాటలు చెప్పి బలవంతంగా తీసుకెళ్లారన్నారు. టీడీపీ కండువా వేసి తమ పార్టీ మద్దతు అభ్యర్థిగా చెప్పుకోవడం సిగ్టుచేటన్నారు. తాను వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని, ప్రాణం పోయినా పార్టీ మారబోనని సర్పంచ్‌గా ఏకగ్రీవమైన స్వామిదేవి తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement