పచ్చనేతల ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో జిల్లా అధికార యంత్రాంగం అక్రమాలకు మద్దతు పలకడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు ఓట్లేయకపోయినా పచ్చనేతలు గెలిచినట్లు ఎన్నికల అధికారులు చాలా చోట్ల డిక్లేర్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు మొదలు కొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

పచ్చనేతల ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో జిల్లా అధికార యంత్రాంగం అక్రమాలకు మద్దతు పలకడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలు ఓట్లేయకపోయినా పచ్చనేతలు గెలిచినట్లు ఎన్నికల అధికారులు చాలా చోట్ల డిక్లేర్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు మొదలు కొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

గోనెగండ్ల జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు గందరగోళం

పలుమార్లు కౌంటింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ తొలగింపు

తాజాగా కౌంటింగ్‌ కేంద్రం ఆవరణలో ఓట్ల కట్ట లభ్యం

వైఎస్సార్‌సీపీ వినతులను పట్టించుకోని కలెక్టర్‌

పచ్చనేతల కుట్రలకు అధికారుల వత్తాసు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జహంగీర్‌కు పడిన ఓట్ల బ్యాలెట్‌ కట్టలు ఓట్ల లెక్కింపు పూర్తయిన కొద్దిరోజులకు అదే ఓట్ల లెక్కింపు కేంద్రం బయట కనిపించడం కలకలం రేపుతోంది. 50 బ్యాలెట్‌ పేపర్లు ఉన్న కట్ట మాత్రమే దొరికినట్లు ప్రచారం ఉన్నా వీటి సంఖ్య వందల్లో ఉందని సమాచారం. నవంబర్‌ 7న జరిగిన ఓట్ల లెక్కింపులో గోనెగండ్ల టీడీపీ అభ్యర్థి తిరుపతయ్య నాయుడు 772 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆర్వోలపై జిల్లా స్థాయి అధికారి నుంచి ఒత్తిడి తెచ్చిన పచ్చనేతలు టీడీపీ అభ్యర్థి గెలిచాడని ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారుల అనుమతితోనే పచ్చనేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పడిన ఓట్ల కట్టలు తీసి బయటపారేసినట్లు సమాచారం. వాస్తవానికి ఆది నుంచి ఈ ఎన్నిక కౌంటింగ్‌ వివాదాస్పదంగానే ఉంది. ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. గోనెగండ్ల జెడ్పీటీసీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పచ్చనేతలు ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో ఓట్ల లెక్కింపులో ఉన్న అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి రౌండ్ల వారీగా వచ్చిన ఓట్లు లేదా మెజార్టీల వివరాలు తెలపలేదు. లెక్కిపు సందర్భంగా పలు దఫాలు విద్యుత్‌ తొలగించడం అనుమానాలను రేకెత్తించింది. చివరి నిమిషంలో 772 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగలేదని, రీ కౌంటింగ్‌ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జహంగీర్‌ పట్టుబట్టినా అధికారులు వినలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తాజాగా ఓట్లేసిన బ్యాలెట్‌ పేపర్లు కౌంటింగ్‌ కేంద్రం ఆవరణలోనే దొరకడం చూస్తే అధికారులు, పచ్చనేతలు కుమ్మకై ్క ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారనేందుకు బలం చేకూరుస్తోంది.

స్పందించని కలెక్టర్‌

ఓట్ల బ్యాలెట్‌ కట్టలు బయటపడినా జిల్లా కలెక్టర్‌కు చీమకుట్టినట్లుగా కూడా లేదు. అక్కడ ఎన్నికల అధికారులుగా ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంలో లోతైన విచారణకు అధికారులు ససేమిరా అంటున్నట్లు సమాచారం. వాస్తవానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కనీసం రెండు నెలలపాటు బ్యాలెట్‌ పేపర్లు బాక్సుల్లో ఉండాలి. మొత్తం బ్యాలెట్లు బ్యాక్సుల్లో ఉన్నాయో లేదో అధికారులకే తెలియాలి. అసలు ఏం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉంది. తప్పు ఎవరు చేసినా వారిని కఠినంగా శిక్షించాలి. కానీ ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

ఉన్నత స్థాయిలో మంత్రుల ఒత్తిళ్లు

నంద్యాల, డోన్‌ మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించగా మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఫరూక్‌లు పట్టుబట్టి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్‌ అధికారితో ఫోన్‌ చేయించి పచ్చపార్టీ అభ్యర్థి నెగ్గినట్లు ప్రకటించుకున్నారు. ఆ తరువాత కౌంటింగ్‌లో ఉన్న కొందరు అధికారుల ద్వారా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. పచ్చపార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జిల్లా అధికారులు వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది.

రీకౌంటింగ్‌ అడిగినందుకు హొళగుంద వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని బయటకు పంపిన అధికారులు (ఫైల్‌)

కౌంటింగ్‌ కేంద్రం ముందు ఆందోళన చేస్తున్న

ఎర్రబాడు, ఒంటేడుదిన్నె గ్రామస్తులు

కౌంటింగ్‌ అక్రమాలపై ‘పచ్చ’పాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement