ఏకగ్రీవ తీర్మానాన్ని చీకట్లో కలిపేసి! | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవ తీర్మానాన్ని చీకట్లో కలిపేసి!

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

● కమలాపురం సర్పంచ్‌ స్థానానికి గుట్టుగా నామినేషన్‌ దాఖలుకు టీడీపీ నేత యత్నం

● కమలాపురం సర్పంచ్‌ స్థానానికి గుట్టుగా నామినేషన్‌ దాఖలుకు టీడీపీ నేత యత్నం

డోన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. డోన్‌ మండలం కమలాపురం సర్పంచ్‌ పదవికి గ్రామస్తులు కలసి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రెండు రోజుల క్రితం తీర్మానం చేశారు. ఈ మేరకు ఓసీ మహిళ రిజ్వర్‌ అయిన ఈ స్థానం నుంచి సర్పంచ్‌గా బరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు బుగ్గన జయచంద్రారెడ్డి సతీమణి బుగ్గన జయలక్ష్మి ఒక్కరే నామినేషన్‌ వేశారు. ఈ విషయం ఆలస్యంగా సోమవారం తెలుసుకున్న టీడీపీ అధినాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు నామినేషన్‌ వేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి బంధువుతో నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అప్పటికే సాయంత్రం 5 గంటలు కావడంతో గడువు ముగిసింది. కాగా నామినేషన్‌ స్వీకరించాలని స్థానిక రిటర్నింగ్‌ అధికారితో పాటు రెవెన్యూ అధికారిపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో నామినేషన్‌ పత్రంతో వెళ్తున్న ఆ టీడీపీ నాయకున్ని పాత్రికేయులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు వెంబడించారు. అధికారులకు సమాచారం తెలియడంతో వారు ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. టీడీపీ అగ్రనాయకుల ఒత్తిడి తట్టుకోలేని సదరు నేత రాత్రి 7 గంటలకు ఆర్‌డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ పని చేసే ఉద్యోగులు సమాధానం చెప్పకుండా తాళం వేసి వెళ్లారు. ఆర్‌డీఓను కలవాలని నియోజకవర్గ ముఖ్యనేత ఆదేశాలతో అతను విస్కుంటూ స్థానిక బాల వెంకటరెడ్డి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆర్‌డీఓ నరసింహులు ఇంటికి వెళ్లారు. ఈ తతంగం అంతా పాత్రికేయులు, పార్టీ నాయకులు వీడియో తీయడంతో సదరు టీడీపీ నేత ద్విచక్ర వాహనంపై అక్కడ నుంచి చిన్నగా జారుకున్నారు. ముందుగా ఏకగ్రీవ ఎన్నికకు అంగీకరించి ఆ తర్వాత చీకటిలో నామినేషన్‌ వేసేందుకు టీడీపీ నాయకులు ఎ ందుకు తాపత్రయ పడాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా ఆర్‌డీఓ నామినేషన్‌ స్వీకరించలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement