కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా ఉద్యోగులు పని చేయాలని నంద్యాల జిల్లా ప్రజా రవాణాధికారి రజియా సూల్తానా పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా సోమవారం నంద్యాల జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు నగరంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో వార్షిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సిబ్బంది తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. డ్రైవర్లు బస్సులు నడిపే సమయంలో రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అలాగే కండక్టర్లు ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ
కోసం నివేదిక
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 21 కరువు మండలాల్లో చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియడంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని మండలాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే చంద్రబాబు సర్కారు 21 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో 4,43,977 సర్వే నెంబర్లలో పంట నష్టంపై సర్వే చేసి 4,37,313 సర్వే నెంబర్లలో 2,64,450.9 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నామ్స్ ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. అయితే, ఇది ఎప్పుడు విడుదలవుతుందో సృష్టత లేదు.
ఉల్లి క్వింటా రూ.3,909
● ఆదోని మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మా ర్కెట్ యార్డులో ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు 6,239 క్వింటాళ్లు (295 లా ట్లు) రాగా కనిష్ట ధర రూ.686, గరిష్ట ధర రూ.3, 909 పలకగా సగటు ధర రూ.3,059గా నమోదైంది. వర్షాభావంతో ఈ సారి మార్కెట్‌కు మొక్కజొ న్న దిగుబడులు భారీగా తగ్గాయి. కేవలం 49 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,470, గరిష్ట ధర రూ.3,054 లభించింది. వేరుశనగ 107 క్వింటాళ్లు రాగా కనిష్ట ధర రూ.5,600, గరిష్ట ధర రూ.9,558, సగటు ధర రూ.8919 నమోదైంది. మిర్చి రెడ్ రకం 134 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.14,089, గరిష్ట ధర రూ.28,079 లభించగా.. సగటు ధర రూ.20,786 లభించింది. కొర్రలు, మినుములు, సజ్జలు మార్కెట్‌కు అతి తక్కువగా వస్తున్నాయి. కాగా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు తగ్గిపోయాయి. మార్కెట్‌కు 4,381 క్వింటాళ్ల పత్తి రాగా కనిష్ట ధర రూ.6,380, గరిష్ట ధర రూ.9,589 పలకగా.. సగటు ధర రూ.9180గా నమోదైంది. ఈ సారి జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ఊసే లేకుండా పోయింది. సీసీఐ ద్వారా పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం విస్మరించింది.
వీరభద్ర స్వామికి వెండి కిరీటం, కవచం అందజేత
బేతంచెర్ల: పట్టణంలోని గౌరిపేటలో వెలసిన వీరభద్ర స్వామికి రూ. 2లక్షల విలువజేసే వెండి కిరీటం, కవచాన్ని సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన ఇపూరి సుభాష్, సంతోషిణి దంపతులు సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రూపు దేవాలయాల మాజీ చైర్మన్ గుండా జగన్, హిందూ ధార్మిక సంఘం నాయకులు హుసేన్ రెడ్డి, మధు మోహన్ రెడ్డి, నాగ మోహన్, చంద్రమౌలీశ్వర్ రెడ్డి, సత్యం, జీవన్ పాల్గొన్నారు.


