నేడు తుంగా హారతి | - | Sakshi
Sakshi News home page

నేడు తుంగా హారతి

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

● నదీ తీరంలో

లక్ష దీపోత్సవం

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో నేడు తుంగా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో తుంగభద్ర నది పుష్కర ఘాట్ల వద్ద మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ముందుగా శ్రీమఠం నుంచి ఉత్సవమూర్తిని నది చెంతకు భాజాభజంత్రీలతో వేద పఠనంతో ఊరేగింపుగా చేరుస్తారు. వేదికపై స్వామి పుణ్య హారతి విశిష్టతను భక్తులకు ప్రవచిస్తారు. ఉత్సవమూర్తికి హారతులు పట్టి పుణ్య హారతికి అంకురార్పణ పలుకుతారు. ఎంతో శాస్త్రోక్తంగా పంచ హారతులు పడతారు. అనంతరం భక్తులు లక్ష దీపోత్సవంలో భాగంగా దీపాలను వెలిగిస్తారు. తుంగా హారతి సందర్భంగా దాసవాణి, నాట్య ప్రదర్శనలతోపాటు గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి మహిళలచే భజనలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement