2వ రోజు దాఖాలైన నామినేషన్లు
స్థానాలకు సభ్యుల
స్థానాలకు
● మొత్తం 9 మండలాల్లోని 150 పంచాయతీల్లో ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. మొదటి రోజున వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచు స్థానాలకు 243 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 742 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండో విడతలో సర్పంచు స్థానాలకు 436 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,529 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విడతలో కోడుమూరు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కోడుమూరు, గూడురు, సీ బెళగల్, కర్నూలు రూరల్, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల్లోని 150 గ్రామ పంచాయతీల్లో సర్పంచు, 1608 వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్ 2వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన 57 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. నామినేషన్ల స్వీకరణకు పీఓ, ఓపీఓలను మొత్తం 114 మందిని నియమించారు. కాగా, ఈ విడతలో కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీల్లో హోరాహోరీ పోరు జరగనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండో రోజైన కోడుమూరులో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే కోడుమూరు మండలం లద్దగిరిలో గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థిగా వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి సతీమణి కోట్ల మంజులారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మండలం సర్పంచు వార్డు
సీ బెళగల్ 51 177
గూడురు 20 57
కోడుమూరు 38 242
కర్నూలు రూరల్ 78 221
క్రిష్ణగిరి 36 114
మద్దికెర 20 91
పత్తికొండ 36 149
తుగ్గలి 74 264
వెల్దుర్తి 83 234
మొత్తం: 436 1,529


