మానవత్వం చాటి.. అండగా నిలిచి | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటి.. అండగా నిలిచి

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

నందికొట్కూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ ఎంపీఈఓకు వ్యవసాయశాఖ అధికారులు, ఉద్యోగులు అండగా నిలిచారు. గత నెల అక్టోబర్‌ 31న జూపాడుబంగ్లా మండలం పారుమంచాల ఎంపీఈఓగా విధులు నిర్వహిస్తున్న అఖిల్‌ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం వ్యవసాయ శాఖ తరఫున ఎంతో మంది అధికారులు తమకు వీలైనంత ఆర్ధిక సహాయం అందించారు. ఆదివారం అయనకు రూ.3,12,600 ఆర్థిక సహాయాన్ని నందికొట్కూరు డివిజన్‌ అగ్రికల్చర్‌ స్టాఫ్‌ తరఫున అందజేశారు. రాష్ట్ర ఏఓ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్‌, నందికొట్కూరు సబ్‌ డివిజన్‌ ఏడీఏ గిరీష్‌, కర్నూలు జిల్లా ఏఓ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ దస్తగిరి రెడ్డి, ట్రెజరర్‌ రామకృష్ణ, జూపాడుబంగ్లా ఏఓ కృష్ణ రెడ్డి తదితరులు హైదరాబాద్‌ గమన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అఖిల్‌ను పరామర్శించారు. అనంతరం అతని భార్యకు ఆ డబ్బును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement