2వ విడతకు తొలి రోజు దాఖలైన నామినేషన్లు ...
పంచాయతీలు స్థానాలకు స్థానాలకు
● నేడు 3వ విడత పల్లె పోరుకు నోటిఫికేషన్ ● నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు
కర్నూలు(అర్బన్): జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొమ్మిది మండలాల్లో 186 గ్రామ పంచాయతీల్లోని సర్పంచు, 1,972 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విడతకు సంబంధించి మొదటి రోజున సర్పంచు స్థానాలకు 97, వార్డు సభ్యుల స్థానాలకు 237 నామినేషన్లు దాఖాలయ్యాయి. ఈ నెల 20వ తేది వరకు ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించిన 73 క్లస్టర్లలో నామినేషన్ల పర్వం కొనసాగనుంది.
నేడు 3వ విడత పల్లె పోరుకు నోటిఫికేషన్
జిల్లాలోని 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 19న(నేడు) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే మొదటి విడతలో ఎనిమి ది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 18వ తేదితో నామినేషన్ల పర్వం ముగిసింది. 2వ విడతలో 9 మండలాల్లోని 186 గ్రా మ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ఈ నెల 18వ తేది నుంచి ప్రారంభమైంది. మొదటి విడత పోలింగ్ ఈ నెల 26వ తేదిన, 2వ విడత పోలింగ్ ఈ నెల 29వ తేదిన, 3వ విడత పోలింగ్ డిసెంబర్ 2వ తేదిన నిర్వహించనున్నారు.
నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు
ఈ నెల 7వ తేదితో ముగిసిన ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19వ తేదిన(నేడు) ఆయా మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జిల్లాలోని మొత్తం 26 మండలాల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుగా కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకున్న అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకోనున్నారు.
మండలం మొత్తం సర్పంచు వార్డు సభ్యుల
కోసిగి 24 33 60
కౌతాళం 30 15 20
మంత్రాలయం 20 06 36
పెద్దకడుబూరు 20 02 13
గోనెగండ్ల 20 07 19
నందవరం 15 07 07
ఎమ్మిగనూరు 17 07 10
కల్లూరు 18 07 36
ఓర్వకల్ 22 13 36
మొత్తం 186 97 237


