హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో నీటిమట్టం తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్లెల్సీ హెడ్‌లో దాదాపు 1,660 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా ప్రస్తుతం పంటలకు నీటి డిమాండ్ పెరగడంతో పాటు కర్ణాటకలో జలచౌర్యం వెరసి ఆంధ్రకు 50 క్యూసెక్కులు కూడా రాని పరిస్థితి. అందులో కర్ణాటక కోటా నీటిని తగ్గించడంతో హొళగుంద సెక్షన్‌లో అడుగు వరకు నీరు పారుతున్నాయి. ఇదిలాఉంటే బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కర్ణాటకలో జలచౌర్యం వల్ల ఆంధ్రకు పూర్తిస్థాయిలో నీరు రావడం అనుమానమేనని తెలుస్తోంది. ఎల్‌ఎల్‌సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద బుధవారం 660 క్యూసెక్కులకు కేవలం 50 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


