నంద్యాలలో వచ్చే నెల 17,18న ఇస్తెమా | - | Sakshi
Sakshi News home page

నంద్యాలలో వచ్చే నెల 17,18న ఇస్తెమా

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

● మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి,

ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా

నంద్యాల(అర్బన్‌): కర్నూలు–కడప జాతీయ రహదారి సమీపంలోని శాంతిరాం జనరల్‌ ఆసుపత్రి వద్ద ఉన్న సున్ని మసీదు ఆవరణలో డిసెంబర్‌ 17, 18 తేదీల్లో దీని ఇస్తెమా నిర్వహిస్తున్నట్లు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తెలిపారు. ఇస్తెమాకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. అనంతరం ముస్లిం మతపెద్దలతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇస్తెమాకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, మెరుగైన పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీల్‌ అమీర్‌, గన్నికరీం, సలాముల్లా, జాకీర్‌ హుస్సేన్‌, యూనస్‌, సోహెల్‌ రాణా, మునెయ్య, మాజీ కౌన్సిలర్లు ఆరిఫ్‌ నాయక్‌, కలాం, తబ్రేజ్‌, మజీద్‌, సాదిక్‌ బాషా, స మ్మద్‌, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement