మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.70,96,949 వచ్చింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు శుక్రవారం చేపట్టారు. ఆలయ పాలక మండలి సభ్యులు, దేవదాయశాఖ అధికారి రమేష్‌ పర్యవేక్షణలో 101 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు రూ.70,96,949 నగదు, 24.5 గ్రాముల బంగారు, 812.250 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు, చైర్మన్‌ ఎల్ల నాగయ్య వెల్లడించారు. కార్యక్రమంలో బాలజీ సేవా ట్రస్ట్‌ సభ్యులు, డోన్‌, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement