ఓటు వేశాం.. వలసెళ్లిపోతున్నాం! | - | Sakshi
Sakshi News home page

ఓటు వేశాం.. వలసెళ్లిపోతున్నాం!

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

గోనెగండ్ల: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. ఇక నాయకులకు ఓటర్లతో పనిలేదు. ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. ఈ తతంగంతో కూలీలకు అవసరం లేదు. కాబట్టి శుక్రవారం ఉదయం బతుకు జీవుడా అంటూ కూలీలు తమ పిల్లపాపలతో పట్టణాలకు వలసబాట పట్టారు. మండలంలోని అలువాల గ్రామం నుంచి రెండు బొలెరో వాహనాల్లో 50 కుటుంబాలు హుబ్లీకి కొందరు, మరికొందరు గోవాకు వలసకు వెళ్లారు. అలాగే గంజిహళ్లి గ్రామం నుంచి 40 కుటుంబాల సభ్యులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో నాయకులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి కొంత సొమ్ము చేతికిచ్చి పిలిపించుకున్నారు. దీంతో వారు స్వగ్రామాల్లో ఓటు వేసి శుక్రవారం మళ్లీ వలస బండ్లు ఎక్కారు. గోనెగండ్లలోని కూలీలు కూడా ఓట్లు వేసి గురువారం రాత్రే బయలుదేరి వెళ్లారు. కొన్ని గ్రామాల కూలీలు మళ్లీ క్రిస్మస్‌కు ఊరికి వస్తామంటే మరికొందరు గంజిహళ్లిలో జరిగే ఉరుసు వేడుకలకు వస్తామని చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక గ్రామం నుంచి వలస బండ్లు వెళుతూనే ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని కూలీలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement