10.30 గంటలకు మొదటి రౌండ్‌ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

10.30 గంటలకు మొదటి రౌండ్‌ ఫలితాలు

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

కర్నూలు(సెంట్రల్‌): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఉదయం 10.30 గంటల్లోపు మొదటి రౌండ్‌ ఫలితాలు వెల్లడించాలని జిల్లా కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం ఆమె స్పెషల్‌ ఆఫీసర్లు, ఆర్వోలు, ఏఆర్వోలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌ తెరవడం, సీల్‌ తొలగించడం, బ్యాలెట్‌ బాక్సులను బయటకు తీసే ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. కౌంటింగ్‌ ప్రారంభానికి ముందు ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్య సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఓట్ల చెల్లుబాటుపై సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ ప్రారంభమైన తర్వాత ఏ కారణంతోనూ ప్రక్రియను నిలిపివేయడానికి వీల్లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement