గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. తుగ్గలి మండలం బొందిమడుగులలో శుక్రవారం వీధులోనే పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. దీనికి తోడు వారు చెప్పిన చోటుకు వెళ్లి పింఛన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెలనెలా పింఛన్ పంపిణీ ప్రహసనంలా మారింది.
– తుగ్గలి


