కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఉల్చాల గ్రామంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు ఉన్న రెండు బైక్‌లకు నిప్పు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో జరిగిన సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ గ్రామానికి చెందిన గొల్ల గోపాల్ తన ఇంటి ముందు రెండు బైక్‌లను ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. బాధితులు తాలూకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
కుమార్తెతో తల్లి అదృశ్యం
జూపాడుబంగ్లా: మండ్లెం గ్రామానికి నాలుగేళ్ల కుమార్తెతో కలిసి సుశీలమ్మ అనే వివాహిత రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఎస్‌ఐ మల్లికార్జున శుక్రవారం తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వార్డెన్‌గా పని చేస్తున్న ఈమె బుధవారం నుంచి ఇంటికి రాకపోవటంతో కుటుంబీకులు అంతటా ఆరా తీశారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో సుశీలమ్మ అన్న మాణిక్యరాజు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


