కర్నూలు: కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని నెరవాడ మహమ్మద్ గౌస్(57) మృతి చెందారు. ఈయన ప్రస్తుతం కర్నూలు రెండవ పట్టణ పోలీ సు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గణేష్‌నగర్ సమీపంలోని క్లాస్‌ఫోర్ ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పంచలింగాల చెక్‌పోస్టు వైపు వెళ్లారు. ఎన్‌హెచ్–44 మార్గంలో చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న 4వ పట్టణ పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించి తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఈయన 1998లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉంది. భార్య బిజాంబీ, కుమారుడు, కూతురు సంతానం. కుమారుడు మహమ్మద్ రఫీ ఫిర్యాదు మేర కు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమో దు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా కొత్తపేటలోని మౌళా మిషన్ దర్గాలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.


