శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థమై బుధవారం సాయంత్రం సాక్షి గణపతి స్వామికి అభిషేకం, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. సాక్షి గణపతి స్వామికి పంచామృతాలతోను, ఫలోదకాలతోను, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోధకం, శుద్ధజలంతో అభిషేకం చేసి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే జ్వాలా వీరభద్రస్వామివారికి అభిషేకం, విశేష పుష్పార్చన జరిపించారు.
కుమార స్వామికి పూజలు
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని కుమార స్వామి ఉపాలయంలో బుధవారం కృత్తికా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ అధికారులు, అర్చకులు విశేష క్రతువులు నిర్వహించారు. కుమారస్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్య, అష్టోత్తరం అనంతరం స్తోత్రపారాయణలు చేశారు. స్వామివారికి పంచామృతాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.
సాక్షి గణపతి జ్వాలా వీరభద్రస్వామి


