చెంచుల సంకల్పం.. వెంకన్న ఆశీర్వాదం | - | Sakshi
Sakshi News home page

చెంచుల సంకల్పం.. వెంకన్న ఆశీర్వాదం

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

శ్రీనివాసుని చిత్తమును గెలిచిన 60 చెంచు కుంటుంబాలు

వారే ఓనర్లు, వారే ఇంజినీర్లు, వారే మేసీ్త్రలు, వారే కూలీలు

కర్నూలులో రూ.5 కోట్లతో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం

నవంబర్‌ 7న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం

చెంచులు నిర్మించుకున్న వెంకన్న ఆలయం

కర్నూలు కల్చరల్‌: వారంతా సంచార జీవనం సాగిస్తుంటారు. కాగితాలు ఏరుకొని అమ్ముకుంటే వచ్చే అరకొర సంపాదనే జీవనాధారం. రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే 60 చెంచు కుటుంబాలది నిరుపేద జీవితం. అయినా ఆ ఏడు కొండల వాడిపై వారి భక్తికి పేదరికం అడ్డుకాలేదు. కలియుగ దైవం శ్రీనివాసుడిని కొలువు దీర్చాలన్న సంకల్పమే వారిలో కొండంత ఆత్మ విశ్వాసం నింపింది. వారే యజమానులై.. వారే ఇంజినీర్‌లై.. వారే మేసీ్త్రలై.. వారే కూలీలై స్వామివారి సేవకు అంకితం చేసుకున్నారు. వాము సంపాదించే అరకొర ఆదాయంలోనూ కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా అందిస్తూ కర్నూలు నగరంలో మూడు సెంట్ల స్థలంలో రూ.5 కోట్ల వ్యయంతో శ్రీనివాసుడి అద్భుత ఆలయం నిర్మించుకున్నారు. చెంచుల పెద్ద ఈరన్న ఆధ్వర్యంలో సాగుతున్న ఈ మహత్తర యజ్ఞం.. వారి భక్తి తత్పరతకు, ఐక్యతకు, సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇలవేల్పుగా భావించి..

చెంచులు ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తుంటా రు. ఎమ్మిగనూరు నుంచి కొన్ని కుటుంబాలు 1994లో కర్నూలు నగరానికి వచ్చాయి. పలు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నెల, రెండు నెలలు ఉండటం తర్వాత మరో ప్రాంతానికి పోవడం. ఇలా ఎన్ని ప్రాంతాలు తిరగాలి. పిల్లలకు చదువు లేదు. సరైన తిండి లేదు అనే ఆలోచన కలిగింది చెంచు ఈరన్నకు. బళ్లారి చౌరస్తా సమీపంలోని శ్రీనివాస నగర్‌లో నివశిస్తున్న వారికి జంగాల శ్రీనివాస్‌ అండగా నిలిచారు. సెంటు, రెండు సెంట్లు స్థలాలు తక్కువ రేటుకు అమ్మడంతో పాటు వారు డబ్బులు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవడ ంతో కొంతఅండగా నిలిచినట్‌లైంది. అక్కడే 2004లో 2.75 సెంట్ల స్థలాన్ని రూ.36 వేలకు కొనుక్కున్నారు. ఆ స్థలంలో జమ్మిచెట్టు వద్ద శ్రీనివాసుడి పటాన్ని పెట్టుకొని పూజలు చేయడం ప్రారంభించారు. రోజుకు ఒక్క పూట కూడా సరైన తిండి లేక ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్న వారికి అప్పటి నుంచి మూడు పూటలా తిండి దొరుకుతుందనే నమ్మకం కలిగింది. దీంతో రెండేళ్లకోసారి శ్రీనివాసుడి కల్యాణం నిర్వహిస్తున్నారు. వేంకటేశ్వరుడిని ఇలవేల్పుగా భావించి ఎలాగైనా ఆలయం నిర్మించాలనుకున్నారు. 2023 నవంబర్‌ 8న భూమి పూజ చేశారు.

మీరా గుడి కట్టేది..

చెంచు ఈరన్న పెద్ద దిక్కుగా ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. విరాళాలకు తిరిగారు. మీరా గుడి కట్టేది. మీకు చందాలు ఇవ్వాలా అంటూ ఎగతాలి చేయడంతో మన దేవుడి ఆలయాన్ని మనమే కట్టుకుందామని నిర్ణయించుకున్నారు. సంపాదించుకున్న డబ్బుల్లో కొంత భాగం ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆలయ నిర్మాణానికి ఓనర్లుగా, ఇంజినీర్లుగా, మేసీ్త్రలుగా, కూలీలుగా మారారు. పనిని బట్టి ఎంత మంది ఆలయ నిర్మాణానికి అవసరమనుకుంటే అంత మంది అందులో పాలు పంచుకున్నారు.

నిధుల సేకరణ ఇలా..

శ్రీ చెంచులక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పే రుతో ఆలయ నిర్మాణానికి పూనుకోవడంతో పా టు నిధులు సమకూర్చుకున్నారు. ప్రతి నెలా రూ.10 లక్షల చీటి వేసి ఆ మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఇలా 40 నెలలు చీటి నడిపి రూ.4 కోట్ల వరకు నిధులు జమ చేసుకున్నారు.

60 చెంచు కుటుంబాల్లో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఒక్కరు కూడా మద్యం సేవించరాదనే నిబంధన పెట్టుకున్నారు. దానికి అయ్యే ఖర్చు అంటే సుమారు రూ.20 వేలు పెళ్లి కొడుకు తరఫు వారు ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలి. ఇలా రూ.80 లక్షల వరకు నిధులు సమకూర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement