నంద్యాల (వ్యవసాయం): పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ హెల్ప్ డెస్క్ క్లినిక్‌ను తనిఖీ చేసి వాటి గురించి ఖైదీలకు అవగాహన కల్పించారు. 70 ఏళ్లు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్, వారి ఆరోగ్యం గురించి తీసుకునే చర్యల గురించి అడిగితెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నంద్యాల వారిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ గురు ప్రసాద్ రెడ్డి, బాలు నాయక్, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


