ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

● ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె

● ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె

కర్నూలు(అగ్రికల్చర్‌): ఐదు రోజుల పని దినాల విధానం తక్షణమే అమలు చేయాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. బ్యాంకుల యాజమాన్య సంస్థ ఐబీఏ, బ్యాంకు యూనియన్స్‌ మధ్య జరిగిన ఒప్పందం అమలు చేయకపోవడంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె అనివార్యమైందని తెలిపారు. బ్యాంకుల మూడు రోజుల సమ్మెకు ముందస్తుగా గురువారం సాయంత్రం గాయత్రీ ఎస్టేటులోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ వారు ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ నాగరాజు మాట్లాడుతూ.. ఐదు రోజుల పని దినాలు కల్పించే విధానం అమలు చేయాలని పలు దఫాలుగా కేంద్ర కార్మిక కమిషనర్‌ సమక్షంలో ఐబీఏ, ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన చర్చల్లో ఎలాంటి హామీ ఇవ్వనందున సమ్మె అనివార్యమైందన్నారు. ఈ నెల 28 నుంచి చేపడుతున్న మూడు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు అన్ని బ్యాంకుల ఖాతా దారులు సహకరించాలని కోరారు. ఆందోళనలో ఏఐబీఈఏ నాయకులు శివ కృష్ణ, వాసుదేవరెడ్డి, ఏఐబీఓసీ నాయకులు రాజు, సూర్య శివ పర్సాద్‌, పుష్పాకుమార్‌, ఏబీజీబీ నాయకులు హనుమంతరెడ్డి, రాఘవేంద్ర తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement