ఇలాంటి పాలసీ ఏ రాష్ట్రంలో లేదు | - | Sakshi
Sakshi News home page

ఇలాంటి పాలసీ ఏ రాష్ట్రంలో లేదు

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

ఇలాంటి పాలసీ ఏ రాష్ట్రంలో లేదు ఇన్‌ప్లుయెన్సర్ల పేరుతో జీతాలా? అబద్ధపు ప్రచారం కోసమే... ●

ప్రభుత్వ ధనాన్ని ఐటీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడం కోసమే ఇన్‌ప్లుయెన్సర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఏకంగా వ్యూస్‌ను బట్టి లక్ష వరకు జీతాలు ఇస్తామని చెప్పడం అన్యాయం. ఇలాంటి పాలసీ ఏరాష్ట్రంలో లేదు. వెంటనే ఈ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పోరాటం తప్పదు.

– కె.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి,

ఏఐవైఎఫ్‌, కర్నూలు

సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల పేరుతో ఐటీ డీపీ వారికి ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడా నికి సిద్ధపడింది. డీఎస్సీలో నారా లోకేష్‌ టీంకు స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఐటీడీపీ కార్యకర్తలకు ఇన్‌ప్లుయెన్సర్ల పేరుతో జీతాలు ఇవ్వడానికి సిద్ధమవడం దారుణం. ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

– వై.నగేష్‌, సీపీఎం నగర కమిటీ సభ్యుడు, కర్నూలు

సీఎం చంద్రబాబు నిజమైన విజనరీ అయినట్లయితే ఇలాంటి ఇన్‌ప్లుయెన్సర్ల పాలసీ అవసరం ఏముంది? అబద్ధాల ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకొని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టడాన్ని చూస్తూ ఊరుకోం. ప్రజల ధనానికి జవాబుదారీతనంగా ఉండాలని కోరుతున్నాం.

– బారెడ్డి విజయభాస్కర్‌ రెడ్డి,

బండిఆత్మకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement