రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

● వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

తుగ్గలి/మద్దికెర: రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగాల భరత్‌కుమార్‌రెడ్డితో కలిసి గురువారం తుగ్గలి మండలం జి.ఎర్రగుడి, మద్దికెర మండలం ఎం.అగ్రహారం పరిసరా ల్లో ఎండిపోయిన కంది, సజ్జ, ఆముదం పంట పొలా లను ఆయన పరిశీలించారు. ముందుగా పలువురు రైతులు తమ కష్టాలను ఆయనకు తెలిపారు. అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. దాదాపు రెండున్నర నెలలకు పైగా వానల్లేకపోవడంతో అన్ని పంటలు ఎండిపోయాయని, ఇప్పుడు వర్షం కురిసినా ఏ మాత్రం దిగుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. రాయలసీమలో జూలైలో 68 శాతం, ఆగస్టులో 58 శాతం లోటు వర్షపాతం ఏర్పడిందన్నారు. చంద్రబాబు కరువును పట్టించుకోకుండా అమరావతిలో బిల్డింగ్‌ అద్దాలకు మాత్రం రూ.2 వేలు కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. 28 జిల్లాల్లో 55.5 శా తం లోటు వర్షపాతం ఉందన్నారు. తక్షణం కరువు అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.15వేలు, పశువులకు పశుగ్రాసం ఉచితంగా ఇవ్వాలన్నారు. పండ్ల తోటల రైతులకు 80శాతం సబ్సిడీతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, ఉపాధి పథకం కింద 150 రోజుల పని కల్పించి, పథ కాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల రైతు విభాగం అధ్యక్షులు రవిచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకులు భాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అయ్యన్న, కృష్ణానాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement