స్వర్ణ పల్లకీలో రాఘవేంద్రుడు విహారం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ పల్లకీలో రాఘవేంద్రుడు విహారం

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం వైభవంగా జరిగింది. గురువారం ఊంజల మంటపంలో ముందుగా రజత రాఘవేంద్రుల బృందావన ప్రతిమకు విశేష పూజలు చేపట్టారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అశేష భక్తజన వాహిని మధ్య స్వర్ణ పల్లకీ సేవ నిర్వహించారు. ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈవీఎంల భద్రతకు

పటిష్ట నిఘా ఉంచాలి

కర్నూలు(సెంట్రల్‌): ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పటిష్టమైన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువా రం కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలోని ఈవీఎమ్‌ గోడౌన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంగోడౌన్‌ను పరిశీలిస్తూ ఈవీఎంలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, ఎంట్రీ, ఎగ్జిట్‌ రిజిస్టర్‌ నిర్వహణకు సంబంధించి ఎన్నికల విభాగం, భద్రతా సిబ్బందికి కలె క్టర్‌ పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎన్ని కల విభాగం సూపరింటెండెంట్‌ మురళి, సా యి ప్రదీప్‌(బీజేపీ), శ్రావణ్‌ కుమార్‌ (వైఎస్‌ఆర్‌సీపీ),అరుణ్‌కుమార్‌(బీఎస్పీ) పాల్గొన్నారు.

జిల్లాలో మోస్తరు వర్షాలు

● హొళగుందలో 40.4 మి.మీ వర్షపాతం

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదు అయింది. హొళగుందలో 40.4 మి.మీ, ఆలూరులో 35.8. చిప్పగిరిలో 30, సీ.బెళగల్‌లో 25.2, ఓర్వకల్‌లో 25.2, ఆదోని–1లో 24.8, హాలహర్విలో 23.6, వెల్దుర్తి లో 20.4, కోడుమూరులో 19.8, కౌతాళంలో 18, కల్లూరులో 17.2, మద్దికెరలో 16.6, క్రిష్ణగిరిలో 15.8, గూడూరులో 15 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. మిగిలిన మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. సెప్టెంబరు నెల సాధారణ వర్షపాతం 116.2 మిమీ ఉండగా.. ఇప్పటి వరకు 64.1 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఉద్యాన పంటలను కాపాడుకోవాలి

కృష్ణగిరి:వర్షాల్లేని పరిస్థితుల్లో ఉద్యాన పంటలను రైతులు కాపాడుకోవాలని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌, పశ్చిమ రాయలసీమ జిల్లాల ప్రత్యేకాధి కారి ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు. అమకతాడు గ్రామ సమీపంలో ఉద్యాన పంటలను గురువారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఉద్యానపంటలను కాపాడేందుకు ప్రభుత్వం రూ.190 కోట్లు మంజూరు చేసిందన్నారు. చీని, మామిడి, సపోట తోటల్లో మొక్కలను బతికించుకునేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. ఫాంపాండ్‌లో వీడ్‌ మ్యాట్‌ వేసి నీటిని ‘డ్రిప్‌’ ద్వారా అయిల్‌పా మ్‌ మొక్క లకు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈయన వెంట జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజకృష్ణారెడ్డి, ఏపీఎంఐపీ ఏపీడీ ఫీరోజ్‌ఖాన్‌, ఉద్యాన అధికారి నరేష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

క్వింటా ఉల్లి రూ.4,630

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం క్వింటా ఉల్లికి గరిష్ట ధర రూ.4630 లభించింది. మొత్తం 2,046 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. క్వింటా సగటు ధర రూ.3,830 నమోదైంది. మార్కెట్‌కు 124 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. కనిష్ట ధర రూ.5,089, గరిష్ట ధర రూ.9,389 లభించింది. సగటు ధర రూ.5719 నమోదైంది. మొక్కజొన్న కొరత ఎక్కువగా ఉండటంతో క్వింటా ధర రూ.2,515 పలికింది. ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తికి కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9709 లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement