ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను పెండింగ్‌లో పెట్టడమేంటి? ఈ విషయంపై సహచర జెడ్పీటీసీలతో కలిసి సీఈఓ దృష్టికి తీసుకుపోయాం. నేటి వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు.
– డీ దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, ఆస్పరి
గౌరవ వేతనాలను అందించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే సహచర జెడ్పీటీసీలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీ సాధారణ నిధుల నుంచి పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
– ఈ రంగనాథ్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు, ఓర్వకల్లు
సర్పంచ్ కాలం గడువు ముగిసినా మేం ఇంకా పదవిలోనే కొనసాగుతున్నాం. అయినా పాలన అంతా ఎలాంటి పదవులు లేని టీడీపీ నేతలతోనే కొనసాగిస్తున్నారు. అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించడం లేదు. గౌరవం ఇవ్వక పోయినా వేతనమైనా ఇస్తుందనుకుంటే అదీలేదు. గడువు ముగిసే లోపైనా ఇస్తారో లేదో?
– ఎద్దుల రాజేశ్వరి, ఎఎంపీటీసీ సభ్యురాలు,
చింతలచెరువు, చాగలమర్రి మండలం
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం ఇవ్వలేదు. నాకు రూ. 78 వేల వేతనం రావాలి? ఎప్పుడు ఇస్తారో తెలియదు. సొంత ఖర్చులతో ప్రతి మండల సమావేవానికి హాజరయ్యా. పదవీ కాలం ముగిసేలోపైనా బకాయిలు చెల్లిస్తారో లేదో? – పెద్ద పేరయ్య, ఎంపీటీసీ
సభ్యుడు, హరివరం, ఉయ్యాలవాడ మండలం


